పబ్లిక్గార్డెన్స్ సమీపంలో దొరికిన తుప్పుపట్టిన రివాల్వర్స్

పబ్లిక్గార్డెన్స్ సమీపంలో దొరికిన తుప్పుపట్టిన రివాల్వర్స్

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో తుప్పుపట్టిన రివాల్వర్లు దొరికాయి. సిబ్బంది చెత్తను తొలిగిస్తుండగా మూడు రివాల్వర్లు బయటపడ్డాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు. రివాల్వర్లు అక్కడికి ఎలా వచ్చాయి.. ఎవరైనా తెచ్చి పెట్టారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.