అగ్నిపథ్ తో యువత భవిష్యత్తును చీకటి చేస్తున్నరు

అగ్నిపథ్ తో యువత భవిష్యత్తును చీకటి చేస్తున్నరు

ప్రధాని నరేంద్ర మోడీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అగ్ని పథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ, అంబానీ కంపెనీలకు కాంట్రాక్ట్ పద్దతిలో దేశ భద్రతను పణంగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అగ్ని పథ్  పథకంతో యువత భవిష్యత్తును చీకటి మయం చేస్తున్నారని  మండిపడ్డారు. యువకులు నాలుగేండ్లు ఆర్మీలో పనిచేసి నిరుద్యోగిగా బయటకు వస్తే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చట్టాలు తీసుకొచ్చి యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చాయని ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన యువకులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.