గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలై జర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్‌లో యూరియా ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇరాన్– ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం వల్ల గ్యాస్ సప్లైలో కోతల కారణంగా ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ ప్లాంట్‌లో రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుండగా, 3 రోజులుగా 1,900 నుంచి 2 వేల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. దీని ప్రభావం వానకాలం సీజన్‌పై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రామగుండం ప్లాంట్ రన్ కావ డానికి రోజుకు 2 మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ మీటర్ల రీగ్యాసిఫైడ్, లిక్విఫైడ్ నేచురల్గ్యాస్ (ఆర్ఎల్ఎన్ జీ) అవసరం ఉంటుంది. ఈ గ్యాస్పశ్చిమాసియాలోని ఖతార్ నుంచి నౌక ల ద్వారా గుజరాత్‌లోని దహేజ టర్మినల్‌కు వస్తుంది. అక్కడి నుంచి పెట్రో నెట్, ఎల్ఎన్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గెయిల్ పైపులైన్ ద్వారా కాకినాడకు చేరుతుంది. కాకినాడ నుంచి మల్లవరం గ్యాస్ పైపులైన్ ద్వారా ఆర్ఎఫ్ సీఎల్ ప్లాంట్‌కు సప్లై అవుతుంది.
యుద్ధం నేపథ్యంలో ఖతార్ నుంచి గుజరాత్‌కు గ్యాస్ రవాణా జరగడం లేదు. దీంతో ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌కు గ్యాస్ సప్లై తగ్గిపోవడంతో క్రమక్రమంగా యూ రియా ఉత్పత్తిలో కోత విధిస్తున్నారు. మొదట 15% ఉత్పత్తి తగ్గించగా, ప్రస్తుతం 50 శాతానికి పడిపోయింది. ఆర్ఎఫ్సీఎల్లో ఏటా 12.7 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో 45 % తెలంగాణకే కేటాయిస్తున్నారు. ఉత్పత్తి తగ్గితే స్టేట్‌పై ఎఫెక్ట్ పడుతుందని అధికారులు చెప్తున్నారు.
