ఒకప్పటి RGV రూమ్.. ఇప్పుడు గాళ్స్ హాస్టల్..

ఒకప్పటి RGV రూమ్.. ఇప్పుడు గాళ్స్ హాస్టల్..

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడతో తన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆర్జీవీ.. బెజవాడలో ఒకప్పుడు తాను స్టే చేసిన రూమ్ ను విజిట్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ తన కాలేజీ డేస్ లో… సిద్ధార్థ కాలేజీ హాస్టల్ వెనుకవైపు ఉన్న ఓ రూమ్ లో ఉండేవారు. ఆ రూమ్ లో రెండేళ్ల పాటు ఉన్నారు. బెజవాడ టూర్లో భాగంగా.. ఆ రూమ్ ను సందర్శించారు రాము. అక్కడి అనుభవాన్ని.. తాను దిగిన ఫొటోను సోషల్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నారు.

ఒకప్పుడు తాను ఉన్న రూమ్.. ఇప్పుడు గాళ్స్ హాస్టల్ గా మారిపోయందన్నారు వర్మ. ఆ గాళ్స్ హాస్టల్ రూమ్ లో ఉంటున్న అమ్మాయిలతో ఫొటో దిగారు. “ఒకప్పుడు నేనున్న రూమ్ లో.. ఈ అందమైన అమ్మాయిలే ఇపుడు రూమ్ మేట్స్ గా ఉంటున్నారు” అని వర్మ చెప్పారు. తన వెనుక ఉన్న గోడపై ఆనాడు శ్రీదేవి పోస్టర్ ను అంటించి పెట్టానని గుర్తుచేశాడు వర్మ.