బషీర్బాగ్, వెలుగు: రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేసీసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సమస్యలపై ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు.
మొత్తం సీఎంఆర్ అప్పగించిన కూడా రాష్ట్రంలో దాదాపు 400 మందికి, వనపర్తి జిల్లాలో 36 మంది రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించకుండా సివిల్ సప్లయ్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని ఆరోపించారు.
గతంలో కెపాసిటీకి మించి కేటాయింపులు చేశారని.. ఆలస్యమైనా మొత్తం సీఎంఆర్ అప్పగించారని, సీఎంఆర్ ఇచ్చాక కూడా డిఫాల్ట్ ఎందుకో సివిల్ సప్లయ్ అధికారులే చెప్పాలన్నారు.
