IND vs ENG 2025: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పంత్ ఔట్..?

IND vs ENG 2025: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పంత్ ఔట్..?

టీమిండియా వైస్ కెప్టెన్.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలి బొటనవేలు విరిగిపోవడంతో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి అందుబాటులో ఉండనన్నట్టు వార్తలు వస్తున్నాయి. గాయంతో ఈ వికెట్ కీపర్ కు ఆరు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో పంత్ లేకుండానే టీమిండియా మిగిలిన రెండు టెస్టులు ఆడినా ఆశ్చర్యం లేదు. పంత్ నాలుగో టెస్ట్ ఆడతాడో లేదో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొదటి రోజు 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు పంత్ గాయపడ్డాడు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతారు. 

అసలేం జరిగిందంటే..?

ఇంగ్లాండ్, ఇండియా మధ్య బుధవారం (జూలై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోర్ 141 పరుగుల వద్ద గిల్ ఔటైనప్పుడు పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు. తనదైన శైలిలో ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చూపంచాడు. 48 బంతుల్లోనే 2 ఫోర్లు, సిక్సర్ తో 37 పరుగులు చేసి దూకుడు మీదున్నాడు. ఈ సమయంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. మూడో సెషన్‎లో వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 68 ఓవర్ మూడో బంతికి రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించే క్రమంలో పంత్ పాదానికి తీవ్ర గాయమైంది. కుడి పాదం వాయడంతో పాటు కొంచెం రక్తం కూడా వచ్చింది.

►ALSO READ | చైనా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–1000 టోర్నీలో సింధు బోణీ ఉన్నతి, సాత్విక్‌‌‌‌ జోడీ కూడా..

ఫిజియో వచ్చి వైద్యం చేసినప్పటికీ పంత్ నడవలేకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు. పంత్ రిటైర్డ్ హార్ట్‎గా వెళ్లిపోవడంతో అతని స్థానంలో జడేజా బ్యాటింగ్‎కు వచ్చాడు. మూడో టెస్టులో చేతి వేలి గాయంతో ఇబ్బందిపడిన పంత్‎కు.. మాంచెస్టర్ టెస్టులో కాలికి గాయం కావడం విచారకరం. ఈ సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్న పంత్ వరుసగా గాయపడటంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్, పంత్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌‌తో బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌‌లో తొలి రోజు ఇండియా ఆధిపత్యం చూపించింది. సాయి సుదర్శన్‌‌ (61), యశస్వి జైస్వాల్‌‌ (58) హాఫ్‌‌ సెంచరీలకు తోడు కేఎల్‌‌ రాహుల్‌‌ (46), రిషబ్‌‌ పంత్‌‌ (37 రిటైర్డ్‌‌హర్ట్‌‌) అండగా నిలవడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది. జడేజా (19 బ్యాటింగ్‌‌), శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (19 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.