LSG vs PBKS: పంత్ ఏంటి ఇది: చేతకాని బ్యాటింగ్ అంటే ఇదే.. కొడితే బ్యాట్, బాల్ రెండూ గాల్లోకి

LSG vs PBKS: పంత్ ఏంటి ఇది: చేతకాని బ్యాటింగ్ అంటే ఇదే.. కొడితే బ్యాట్, బాల్ రెండూ గాల్లోకి

లక్నో సూపర్ జయింట్స్  పేలవ ఫామ్ ఐపీఎల్ 2025 లో కొనసాగుతుంది. కెప్టెన్ గా ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే అత్యంత కీలకంగా మారిన మ్యాచ్ లో ఆదివారం (మే 4) పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో 17 బంతుల్లో కేవలం 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంత్ ఔట్ అయిన విధానంపై విమర్శలు వస్తున్నాయి. 

క్రీజ్ లో ఉన్నంతవరకు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన పంత్.. ఒక్కో పరుగు కోసం తీవ్రంగా విమర్శించాడు. అప్పటికీ ఒక ఫోర్ మిస్ ఫీల్డ్ వలన వచ్చింది. ఓమార్జాయి వేసిన ఇన్నింగ్స్ 8 ఓవర్ అయిందో బంతిని పంత్ ముందుకు వచ్చి ఆడాడు. భారీ షాట్ కు ప్రయత్నించినా టైమింగ్ మిస్ కావడంతో బ్యాట్ జారింది. ఈ దీంతో స్క్వేర్ లెగ్ లో ఫీల్డర్ క్యాచ్ అందుకోగా.. చేతిలో నుంచి జారీ పడిన బంతి లెగ్ సైడ్ గాల్లోకి లేచింది. 
    
ఈ  మ్యాచ్ విషయానికి వస్తే 237 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓటమి దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజ్ లో ఆయుష్ బదోనీ (34), అబ్దుల్ సమద్ (25) ఉన్నారు. పంజాబ్ గెలవాలంటే చివరి 7 ఓవర్లలో 121 పరుగులు చేయాలి. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది.