కమెడియన్ సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘జెట్‌లీ’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. మే1 సినిమా విడుదల. బుధవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సత్య మాట్లాడుతూ ‘ఇందులో నా పాత్ర హీరోలా కాకుండా కామెడీ స్పేస్‌లో ఉంటుంది. యాక్షన్ కూడా కామికల్‌గానే ఉంటుంది’ అని చెప్పాడు. దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ ‘సత్యను దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్ట్ డిజైన్ చేశాం. తన వల్ల కామెడీ మరింత ఎలివేట్ అయింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా సత్యతో తీస్తే ఎలా ఎంటుందో ఈ సినిమా అలా ఉంటుంది.
యాక్షన్, కామెడీ, ట్విస్టులతో కొత్తగా ఉంటుంది’ అని అన్నాడు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ‘సినిమా స్టోరీ చెప్పగానే క్లూస్ పట్టేసే టీఎఫ్‌ఐ బానిసగా కనిపిస్తా. దుబాయ్ నుంచి వస్తుంటే ఫ్లైట్‌లో జరిగిన ఊహించని చిత్రవిచిత్రాలు ఎదురవుతాయి. అవి ఏమిటి, టైమ్ పాస్‌కు ఆడుతున్న సుడోకు గేమ్ పూర్తి చేశానా లేదా అన్నది థియేటర్‌లో చూడాలి’ అని చెప్పాడు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ‘ఇదొక మంచిథ్రిల్లర్. పెద్ద హీరోతో చేయాలనుకున్నాం. కుదరక కామెడీ థ్రిల్లర్‌గా మార్చాం. దాదాపు 80 శాతం ఫ్లైట్‌లోనే తీశాం. టాలీవుడ్‌లో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. రితేష్ తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పారు. హీరోయిన్ రియా సింఘా, నటులు శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

