భద్రాచలం, వెలుగు: ఏరు ఉత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం భద్రాచలంలోని గోదావరికి అర్చకులు నదీ హారతి ఇచ్చారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశాల మేరకు ప్రతీ ఆదివారం ఈ ఉత్సవాన్ని జరుపుతున్నారు. గణపతి పూజ, దీపోత్సవం అనంతరం గోదావరి హారతి ఇచ్చారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
