
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సంపిస్తున్న క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. మహాఘట్ బంధన్ మధ్య సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తిన క్రమంలో 143 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఆర్జేడీ. రెండో దశ నామినేషన్ల చివరి రోజైన సోమవారం ( అక్టోబర్ 20 ) అభ్యర్థుల జాబితా విడుదల చేసింది ఆర్జేడీ.
తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది ఆర్జేడీ. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, నవంబర్ 14న లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన జరుగుతుంది.
మహాఘట్ బంధన్ మధ్య సీట్ల పంపకం విషయంలో వివాదం కొనసాగుతున్న క్రమంలో అభ్యర్థుల జాబితా ఆలస్యంగా ప్రకటించింది ఆర్జేడీ. అధికారిక జాబితా విడుదలకు ముందే అబ్యర్ధులకు పార్టీ చిహ్నాలను కేటాయించింది ఆర్జేడీ.2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల్లో ఒక సీటు తక్కువ పోటీ చేస్తోంది ఆర్జేడీ.2020 ఎన్నికల్లో 144 సీట్లలో పోటీ చేయగా.. ఇప్పుడు 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఆర్జేడీ.
ఆర్జేడీ కీలక నేతలు తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుండి పోటీ చేస్తుండగా.. మాధేపురా నుండి చంద్రశేఖర్, మొకామా నుండి వీణా దేవి ( సురభన్ భార్య ), ఝుఝూ నుండి ఉదయ్ నారాయణ్ చౌదరి బరిలో ఉన్నారు.