- క్లినిక్ సీజ్ చేసిన ఆఫీసర్లు
గద్వాల, వెలుగు: ఆర్ఎంపీ ట్రీట్మెంట్ వికటించి ఐదేండ్ల పాప చనిపోయిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన నిఖిత(5)కు జ్వరం రావడంతో బుధవారం స్థానిక ఆర్ఎంపీ నరసింహ వద్దకు తీసుకెళ్లారు. పాపకు హై డోస్ ఇంజక్షన్ఇవ్వడంతో వికటించి చనిపోయింది. విషయం తెలియడంతో కలెక్టర్సంతోష్ స్పందించి విచారణకు ఆదేశించారు. డాక్టర్లు ప్రసన్న రాణి, సంధ్య కిరణ్మయి వెళ్లి క్లినిక్‌లో విచారించారు. హై డోస్ ఇంజక్షన్ఇవ్వడంతోనే పాప చనిపోయిందని గుర్తించారు. క్లినిక్‌ను సీజ్‌చేసి, ఆర్ఎంపీ నరసింహపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డాక్టర్లు తెలిపారు.
