
అల్వాల్, వెలుగు : బైక్‌పై ఇంటికి వెళ్తున్న న్యాయవాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అల్వాల్‌లోని కానాజిగూడ టెలికం కాలనీకి చెందిన రావల్కొల్ ఇంద్ర గౌడ్ (59) వృత్తిరీత్యా అడ్వకేట్. సికింద్రాబాద్ కోర్టులో విధులు ముగించుకుని శనివారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా, వేద విహార్ సమీపంలో ప్రైవేటు బస్సు పక్కనుంచి వెళ్తూ కిందపడ్డాడు. అనంతరం బస్సు వెనుక టైరు ఆయన తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.