దిల్‎సుఖ్ నగర్‎లో డివైడర్‎ను ఢీకొన్న బైక్.. అక్కడికక్కడే ఇద్దరు స్నేహితులు మృతి

దిల్‎సుఖ్ నగర్‎లో డివైడర్‎ను ఢీకొన్న బైక్.. అక్కడికక్కడే ఇద్దరు స్నేహితులు మృతి

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ప్రమాదవశాత్తు బైక్​డివైడర్‎ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్, టెలిఫోన్ కాలనీ ప్రాంతాలకు చెందిన మధు, హరీశ్​స్నేహితులు. వీరిద్దరు శనివారం బయటికి వెళ్లి రాత్రి బైక్‎పై ఇంటికి వస్తున్నారు. విక్టోరియా మెమోరియల్ స్కూల్ మెట్రో స్టేషన్ సమీపంలో 1618 నంబర్ పిల్లర్​ వద్ద రోడ్డు డివైడర్‎ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‎లో మృతిచెందారు. పోలీసులు డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.