వేం నరేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం..కారులో చెలరేగిన మంటలు

వేం నరేందర్ రెడ్డికి తప్పిన  ప్రమాదం..కారులో చెలరేగిన మంటలు

నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం మహబూబాబాద్  జిల్లాలో పర్యటించిన ఆయన కారులో మంటలు చెలరేగాయి. హెలీప్యాడ్ వద్దకు కారులో వెళ్తుండగా, సోమ్లాతండా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని ఓ కారులో మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.