గజ్వేల్ దగ్గర రోడ్డు ప్రమాదం.. బైక్‎పై వెళ్తున్న భార్యభర్తలు చనిపోయారు

గజ్వేల్ దగ్గర రోడ్డు ప్రమాదం.. బైక్‎పై వెళ్తున్న భార్యభర్తలు చనిపోయారు

సిద్దిపేట: కారు ఢీకొని బైక్‎పై వెళ్తున్న భార్యభర్తలు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గజ్వేల్ మండలం షేర్‏పల్లి‎కి చెందిన ప్రవీణ్ (50), జ్యోతి (45)  భార్యభర్తలు. సోమవారం (మే 18) పని నిమిత్తం ఇద్దరు కలిసి బైక్‎పై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో గజ్వేల్ సమీపంలోని పత్తి మిల్ దగ్గర ప్రమాదానికి గురయ్యారు.

కారు ఢీకొని భార్యభర్తలు చనిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‎మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.