
వైఎస్సార్ జిల్లా కొండాపూర్ మండలం చిత్రావతి బ్రిడ్జి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో తుఫాన్ లోని ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి
తుఫాన్ వాహనంలో తిరుమలకు వెళ్ళి తిరిగి వస్తుండగా మరో 20 నిమిషాలలో తాడిపత్రికి చేయవలసి ఉండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితులు తాడిపత్రికి చెందిన వారీగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయాలైన వారిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు.