బాధితుడి ప్రాణం నిలిపిన ఏసీపీ... గాంధీ- మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం.. పెట్రోలింగ్ వాహనంలో దవాఖానకు తరలింపు

బాధితుడి ప్రాణం నిలిపిన ఏసీపీ... గాంధీ- మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం.. పెట్రోలింగ్ వాహనంలో దవాఖానకు తరలింపు

పద్మారావునగర్, వెలుగు :  అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలో దవాఖానకు తరలించి ప్రాణదాతగా నిలిచాడో ఏసీపీ..ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి గాంధీ దవాఖాన మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. 

మల్కాజిగిరికి చెందిన ఎన్.కిరణ్ (35) మంగళవారం రాత్రి స్కూటీపై వెళ్తుండగా గాంధీ మెట్రో స్టేషన్ వద్ద అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కాగా, ఆ టైంలో పెట్రోలింగ్ విధులను పర్యవేక్షిస్తున్న చిలకలగూడ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి అటు వైపు వచ్చారు. 

రోడ్డుపై పడి ఉన్న బాధితుడిని గమనించి తన అధికారిక వాహనంలో గాంధీకి తరలించి అత్యవసర చికిత్స అందేలా చూశారు. తర్వాత కిరణ్​కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వారు ప్రైవేట్ దవాఖానకు తరలించారు. సకాలంలో స్పందించి బాధితుడి ప్రాణాలు కాపాడిన ఏసీపీని, సిబ్బందిని స్థానికులు, ఉన్నతాధికారులు అభినందించారు.