
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో కురిసిన ఎడతెరిపి లేని వానతో కొడంగల్అతలాకుతమైంది. శనివారం రాత్రి ఏకధాటి వర్షానికి కొడంగల్, హస్నాబాద్, బోంరాస్‌పేట, దౌల్తాబాద్‌లోని చెరువులు పొంగిపొర్లగా, పర్సపూర్ రాయలపేట చెరువుకు గండి పడింది. హుసేన్‌పూర్ వద్ద రోడ్డు కోతకు గురికావడంతో పెద్దనందిగామ, గుండ్లకుంట గ్రామాలకు రాకపోకలు ఇబ్బందికరమయ్యాయి. కంది, పత్తి, వరి పంటలు నీటమునిగి, పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. దౌల్తాబాద్లోఅత్యధికంగా 7 సెం.మీ., కొడంగల్‌లో 5 సెం.మీ., బోంరాస్పేటలో 2.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.