హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన టూ వీలర్ వెహికల్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులకు గాయాలయ్యాయి. టూ వీలర్ వెహికల్ కారు కిందకు దూసుకుపోవడంతో నుజ్జనుజ్జ అయ్యింది.
యాక్సిడెంట్ తో ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓ వైపు వర్షం పడుతుండడం, మరో వైపు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారును, టూవీలర్ వెహికల్ ను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
