బెట్టింగ్ కోసం అన్న ఇంట్లో చోరీ ...చెల్లి, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్

బెట్టింగ్ కోసం అన్న ఇంట్లో చోరీ ...చెల్లి, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: ఆన్​లైన్​బెట్టింగ్​కు అలవాటు పడి సొంత అన్న ఇంట్లో దొంగతనం చేసిన చెల్లిని, ఆమెకు సహకరించిన ఇద్దరిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్​చేశారు. జగద్గిరిగుట్ట పరిధిలోని షిరిడీ హిల్స్​లో  వేముల శ్రీకాంత్​తన భార్య, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అతని తల్లిదండ్రులు కర్మంఘాట్​లో ఉండగా, వారు కొత్త కారు కొనడంతో పూజ కోసం ఈ నెల 6న అక్కడికి వెళ్లాడు. 

పూజకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని 12 తులాల బంగారం, వెండి, నగదు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తన చెల్లినే ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. ఆమె గత 8 ఏండ్లుగా భర్తకు దూరంగా ఉంటూ తండ్రి ఇంట్లోనే ఉంటోంది. ఆన్ లైన్​బెట్టింగ్​కు అలవాటుపడి రూ.5 లక్షల వరకూ అప్పుల పాలైంది. శ్రీకాంత్​కు అతని చెల్లెలుకు మనస్పర్థలు ఉండటంతో అన్న ఇంట్లో దొంగతనం చేసి అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. అన్న, వదినలు ఇంటికి రాగానే వదిన పర్స్​లోని తాళం చెవిని తీసి షూ రాక్​లో దాచిపెట్టింది.

 రాత్రి అందరూ పడుకున్నాక తన ప్లాన్  ప్రకారం స్నేహితులైన కార్తిక్​, అఖిల్​ పిలిచి జగద్గిరిగుట్టలోని అన్న ఇంటి తాళం చెవి ఇచ్చింది. దీంతో వారు వెళ్లి బంగారం, వెండి, నగదును దొంగలించారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు.