ఇదేం పాలన.. ట్రంప్ను ఘోరంగా తిట్టిన హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరో

ఇదేం పాలన.. ట్రంప్ను ఘోరంగా తిట్టిన హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరో

రాబర్ట్ డి నీరో..ప్రముఖ అమెరికన్ సీనియర్ నటుడు. ఇతనికి ట్రంప్ పై చాలా కోపం వచ్చింది..ఏకంగా ఫిల్మ్ ఫెస్టివల్ ఫంక్షన్ లోనే ఎడాపెడా తిట్టాడు. నా దేశంలో ఒకప్పుడు ప్రజాస్వామ్యం ఉండేది.. ఇప్పుడు నరకంలా మారిందని హాట్ హాట్ కామెంట్లు చేశారు. రాబర్ట్ డి నీరో డోనాల్డ్ ట్రంప్‌పై ఎందుకు కోపం వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

అమెరికలో జరుగుతున్న  78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అమెరికా సీనియర్ నటుడు రాబర్ట్ డి నీరో తీవ్రంగా విమర్శించాడు. లియోనార్డో డికాప్రియో చేతుల మీదుగా పామ్ డీ ఓర్ అవార్డు అందుకున్న 81యేళ్ల నీరో.. మహామహులున్న వేదికపై అమెరికా అధ్యక్షుడి తనదైన శైలిలో తిట్లదండకం అందుకున్నాడు.

 నీరో తన ఎమోషనల్ స్పీచ్ లో సినిమారంగంపై ట్రంప్ విధించిన సుంకాలు,నిధుల కోతలపై ఖండించారు. ఇది ప్రజాస్వామ్యం, కళలకు పెద్ద ముప్పు అని అన్నారు..  స్వేచ్ఛ, కళలను రక్షించేందకు ప్రతిఒక్కరూ స్పందించాలన్నారు. ఓటింగ్ ద్వారా ప్రపంచమంతా చర్యలు తీసుకోవాలన్నారు. 

 రాబర్ట్ డి నీరో విదేశీ నిర్మాణ చిత్రాలపై 100 శాతం సుంకాన్ని వ్యతిరేకించారు. POTUS ను విమర్శిస్తూ.. ప్రజాస్వామ్యం, కళలకు పరిమితులు విధించడం ఏంటని ప్రశ్నించారు. 

‘‘నా దేశంలో ఒకప్పుడు ప్రజాస్వామ్యం ఉండేది.. ఇప్పుడు దాని కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్నామన్నారు.’’ రాబర్ట్ డీ నీరో.  కళలు ప్రజాస్వామ్యబద్ధమైనవి.ట్రంప్ నిర్ణయం మనందరినీ ప్రభావితం చేస్తుందన్నారు.  కళ అన్నింటినీ కలుపుకుపోతుంది. ప్రజలను ఏకం చేస్తుంది. కళ వైవిధ్యాన్ని స్వీకరిస్తుంది. అందుకే నిరంకుశ పాలకులు ,ఫాసిస్టులకు కళ ఒక ముప్పు భావిస్తున్నారు అని అన్నారు. సుంకాలపై డెడ్ లైన్ విధించిన అంశాన్ని గుర్తు చేశారు. 

ఇది కేవలం అమెరికన్ సమస్య కాదు.ఇది ప్రపంచవ్యాప్త సమస్య. మనమందరం వెనక్కి తిరిగి చూస్తూ కూర్చోలేం అని డి నీరో అన్నారు. మనం ఇప్పుడు చర్య సిద్దం కావాలి. హింసతో కాదు..గొప్ప అభిరుచి,దృఢ సంకల్పంతో అన్నారు. స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కరూ నిరసన తెలిపాలన్నారు. లిబర్టే, ఎగలిటే, ఫ్రాటర్నిటే," అని రాబర్ట్ డి నీరో తన స్పీచ్ ను ముగించారు. 

రాబర్ట్ డీ నీరో 'ది గాడ్‌ఫాదర్' (1972), 'రేజింగ్ బుల్' (1980), 'టాక్సీ డ్రైవర్' (1976) తోపాటు మరెన్నో చిత్రాలలో తన పాత్రల ద్వారా సినిమాకు చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన పామ్ డి'ఓర్ అవార్డును అందుకున్నాడు.