రోహిత్, రాహుల్ జోరు.. టీమిండియా కొత్త రికార్డులు

రోహిత్, రాహుల్ జోరు.. టీమిండియా కొత్త రికార్డులు

బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ కు శుభారంభం దక్కింది. స్ట్రైకర్ కేఎల్ రోహిత్ తో కలిసి.. ఓపెనర్ రోహిత్ శర్మ భారత్ కు బలమైన పునాది వేశాడు. రోహిత్ శర్మ 46 బాల్స్ లో హాఫ్ సెంచరీ… 89 బాల్స్ లో సెంచరీ పూర్తిచేశాడు. అందులో 5 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. అటు కేఎల్ రాహుల్ కూడా 57 బాల్స్ లో 1 సిక్సర్, 5 ఫోర్ల సాయంతో 50 రన్స్ మార్క్ దాటాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 17.2 ఓవర్లలోనే వంద రన్స్ జోడించారు.  ఓవరాల్ గా 29.2 ఓవర్లలో 180 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం అందించారు.

రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ అందించిన తొలి వికెట్ పార్ట్ నర్ షిప్ స్కోరు… వరల్డ్ కప్ లో ఇండియా తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నమోదైంది. వరల్డ్ కప్ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ల 174 రన్స్ భాగస్వామ్యాన్ని రోహిత్ – కేఎల్ రాహుల్ జోడీ సరిచేసింది.

రోహిత్-కేఎల్ రాహుల్ జోడీ.. మొదటి 10 ఓవర్ల పవర్ ప్లేలో ఈ వరల్డ్ కప్ లోనే అత్యధికంగా 69 రన్స్ చేసింది.

ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఇండియా 3 సార్లు వందకు పైగా ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్స్ అందించింది. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 127, పాకిస్థాన్ పై 136 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం అందించారు ఓపెనర్లు. ఒక వరల్డ్ కప్ లో అత్యధిక ఆరంభ భాగస్వామ్యాల రికార్డ్ ఆస్ట్రేలియా పేరిట 2007లో నమోదై ఉంది. భారత్ రెండో స్థానంలో నిలించింది.