రోహిత్‌కు ప్లేసుందా?
మయాంక్, విహారిలో వేటు ఎవరిపై?
టీమిండియాకు సెలెక్షన్ తలనొప్పులు
మరో ఏడు రోజుల్లో మూడో టెస్ట్
న్యూఢిల్లీ: సెకండ్ టెస్ట్‌లో ఐదుగురు బౌలర్ల స్ట్రాటజీ.. టీమిండియాకు అద్భుతంగా కలిసొచ్చింది. కెప్టెన్‌గా రహానె వేసుకున్న ప్రతి ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. దాని ఫలితమే చరిత్రాత్మక విజయంతో సిరీస్ సమమైంది. ఇంతవరకు అంతా బాగుంది. కానీ ఇప్పుడు అసలు సమస్య బ్యాటింగ్‌లోనే కనిపిస్తున్నది. మరి దానికి చెక్ పెట్టాలంటే మేనేజ్‌మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది.
రోహిత్‌ను ఏం చేస్తారు?
ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాల్సిన ప్రధాన సమస్య ఓపెనింగ్ జోడీ. స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ జట్టుతో కలవడంతో ఇప్పుడు ఈ అంశంపై అందరి దృష్టి నెలకొంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ ద్వారా టెస్ట్ ఓపెనర్‌గా రోహిత్ సూపర్ సక్సెస్ సాధించాడు. హ్యామ్‌స్ట్రింగ్ నుంచి కోలుకుని ఆసీస్ వెళ్లిన రోహిత్.. రెండు వారాల క్వారంటైన్ పూర్తి చేసుకుని బుధవారం టీమ్‌తో కలిశాడు. రోహిత్ ఫిట్‌నెస్ లెవెల్స్‌పై ఓ అంచనాకు వచ్చాకే అతనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కోచ్ రవిశాస్త్రి ఆల్రెడీ చెప్పాడు. అయితే హిట్‌మ్యాన్ ఫిట్‌గా ఉండి థర్డ్ టెస్ట్ సెలెక్షన్‌కు అందుబాటులోకి వస్తే.. ఏ ప్లేస్‌లో ఆడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్‌ను ఓపెనర్‌గానే కొనసాగించాలంటే.. ఇప్పుడున్న యంగ్ ఓపెనర్లలో ఒకరిపై వేటు వేయాలి. అప్పుడు మయాంక్, గిల్‌లో ఒకరు తమ ప్లేస్‌ను త్యాగం చెయ్యాలి. బాక్సింగ్ డే టెస్ట్‌లో అరంగేట్రం చేసిన గిల్.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో ఈ యంగ్‌స్టర్ ప్లేస్‌కు ప్రస్తుతానికి ఢోకా లేదు. దీంతో ఫామ్ కోసం తంటాలు పడుతున్న మయాంక్‌పై వేటు వెయ్యాలి. మేనేజ్‌మెంట్ ఆ పని చేస్తుందా అంటే.. అవునని చెప్పలేం.
విహారి త్యాగం చేస్తాడా?
అలా కాకుండా రోహిత్, మయాంక్ ఇద్దరినీ తుది జట్టులో ఆడించాలనుకుంటే మిడిలార్డర్‌లో హనుమ విహారిని బెంచ్‌కు పరిమితం చెయ్యాలి. రోహిత్‌ను ఓపెనర్‌గా పంపాలన్నా.. అతనికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. కాబట్టి ఇక తప్పదు మిడిలార్డర్‌లోనే అకామిడేట్ చేయాలంటే మాత్రం విహారి త్యాగం చేయాల్సిందే. కానీ ఈ సమీకరణానికి రహానె ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్‌లో మయాంక్‌ను తప్పించి రోహిత్‌ను తీసుకుంటే ఎక్స్‌పీరియెన్స్ పెరుగుతుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌లో జరిగిన సిరీస్‌లో రోహిత్ టెస్ట్ ఓపెనర్‌గా ఆడాల్సి ఉంది. కానీ గాయం వల్ల సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు.మరోపక్క అసలు రోహిత్ ఏ స్థానంలో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడనేది కూడా తేలాల్సి ఉంది. అసలు థర్డ్ టెస్ట్ ప్లాన్స్ నుంచి రోహిత్‌ను పూర్తిగా తప్పించి రాహుల్‌కు చాన్స్ ఇస్తారేమో చూడాలి.
మయాంక్‌ను తప్పించడం కష్టమా?
ఓపెనర్‌గా రోహిత్.. ఫైనల్ ఎలెవన్‌లోకి రావాలంటే ఇప్పుడున్న ఆప్షన్ ప్రకారం మయాంక్‌పై వేటు పడుతుంది. కానీ గత 18 నెలల్లో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసిన మయాంక్‌ను పక్కనబెట్టడం కఠినమైన నిర్ణయమేనని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ‘రోహిత్ వస్తే మయాంక్, విహారిలో ఒకరు బయటకు వెళ్లాల్సిందే. కానీ గత ఫామ్ ప్రకారం మయాంక్‌ను పక్కనపెట్టడం అంటే అది కఠినమైన నిర్ణయమే. పైగా లాంగ్ బ్రేక్ తర్వాత వస్తుండటంతో రోహిత్ కూడా ఓపెనింగ్‌కు ఇష్టపడతాడని నేను అనుకోవడం లేదు. ఓపెనింగా? మిడిలార్డరా ? హిట్‌మ్యాన్ ఏం కోరుకుంటాడో తేలాలి ’ అని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. మయాంక్, విహారి ప్లేస్‌లను రోహిత్, రాహుల్‌తో భర్తీ చేసి జట్టును మరింత బలోపేతం చేయాలని మరో మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ సూచించాడు.

