IND vs AFG, 3rd T20I: వణికించిన ఆఫ్ఘన్లు ..రోహిత్ తీసుకున్న రెండు నిర్ణయాలే గెలిపించాయి

IND vs AFG, 3rd T20I: వణికించిన ఆఫ్ఘన్లు ..రోహిత్ తీసుకున్న రెండు నిర్ణయాలే గెలిపించాయి

భారత్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించాలంటే ఏ జట్టుకైనా సవాలే. సొంతగడ్డపై మన జట్టు విజయాన్ని అడ్డకోవడడం శక్తికి మించిన పని. అయితే పసికూనగా భావించే ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీమిండియాను హడలెత్తించింది. అసాధ్యమనుకున్న మ్యాచ్ ను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లి రోహిత్ సేనకు చెమటలు పట్టించారు. 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఏ మాత్రం తడబడకుండా టై చేసుకొని ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ ను సైతం గట్టి పోటీ ఇస్తూ టైగా ముగించింది.

భారత్ విజయం సాధించటానికి రోహిత్ శర్మ బ్యాటింగ్ కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మ్యాచ్ లో మొదట రోహిత్ శర్మ (69 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సెంచరీతో చెలరేగగా.. మొదటి సూపర్ ఓవర్ లో 13, రెండో సూపర్ ఓవర్ లో 11 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోహిత్ ఆట భారత విజయానికి కారణమైన అసలు విజయం మాత్రం హిట్ మ్యాన్ కీలక దశలో తీసుకున్న రెండు నిర్ణయాలే మ్యాచ్ ను గెలిపించాయి. 

మొదటి సూపర్ ఓవర్లో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో రోహిత్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. అప్పటికే అలసిపోయిన రోహిత్ చివరి బంతికి వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తలేనని భావించి డగౌట్ కు వెళ్ళిపోయాడు. రింకూ సింగ్ రోహిత్ స్థానంలో రన్నింగ్ కు వచ్చాడు. ఇక రెండో సూపర్ ఓవర్ లో 12 పరుగుల లక్ష్య ఛేదనలో అప్పటికే ముఖేష్ తొలి సూపర్ వేయడంతో ఆవేశ ఖాన్ మినహా మరో పేసర్ కనిపించలేదు. కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం అవేశ్ ఖాన్ బౌలింగ్ ఇవ్వాలని సూచించాడు. 

ఈ సమయంలోనే రోహిత్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం భారత్ కు విజయాన్ని అందించింది. స్పిన్నర్ బిష్ణోయ్ బౌలింగ్ వేయాలని సూచించాడు. సూపర్ ఓవర్లో స్పిన్నర్లకు బౌలింగ్ ఇవ్వడం చాలా రిస్కీ. అయినప్పటికీ రోహిత్ బిష్ణోయ్ మీద నమ్మకముంచాడు. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ 12 రన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్ లో తొలి మూడు బంతులకు బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ నబీని, రహ్మనుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో అఫ్గాన్ ఒకే రన్‌‌‌‌‌‌‌‌ చేసి ఓడింది. ఒక బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గా రోహిత్ తీసుకున్న తెలివైన నిర్ణయాలు భారత్ ను ఓటమి నుండి గట్టెక్కించాయి.