ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీగా రొనాల్డ్ రోస్ బాధ్యతల స్వీకరణ

ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీగా రొనాల్డ్ రోస్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగులు సమష్టి కృషితో పని చేసి కరెంటు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ కార్యదర్శి ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ రొనాల్డ్ రోస్ ఆదేశించారు. విద్యుత్ సంస్థల పురోగతిలో ఇంజినీర్లు, అధికారులు భాగస్వామ్యం కావాలని చెప్పారు. బుధవారం విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్లు, ఇంజినీర్ల సంఘాల నేతలు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఎండీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ సందర్భంగా సీఎండీ రొనాల్డ్ రోస్​ మాట్లాడారు. కరెంటు ఉద్యోగులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అకౌంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. సుబ్బయ్య, పవర్ ఇంజినీర్స్ జేఏసీ ప్రెసిడెంట్ ఎ. వెంకట్ నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ పి. సదానందం, వీఏఓఏటీ వైస్​ ప్రెసిడెంట్​నాజర్​ షరీఫ్, జాయింట్​ సెక్రటరీ పరమేశ్, సీహెచ్​అనురాధ, స్వామి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ ప్రసాద్, వెంకటేశ్, ప్రశాంత్, రాజు, పవర్ జేఏసీ నాయకులు కె. కిరణ్ కుమార్, గోపాల్ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.