నిజాలు మాట్లాడితే దాడులా: సీనియర్​ జర్నలిస్టులు

నిజాలు మాట్లాడితే దాడులా: సీనియర్​ జర్నలిస్టులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సోషల్‌‌‌‌ మీడియా వేదికగా నిజాన్ని నిర్భయంగా చెబుతున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ తులసీ చంద్​ను కొంతమంది కించపరుస్తూ అవమానకర కామెంట్లు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని సీనియర్​జర్నలిస్టులు మండిపడ్డారు. తులసీ చంద్​కు మద్దతుగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో  ‘జర్నలిజం–-ట్రోల్ ముఠాలు’ అనే అంశంపై వివిధ జర్నలిస్ట్ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 

ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు అమర్‌‌‌‌‌‌‌‌, సీనియర్​జర్నలిస్టులు​కె. శ్రీనివాస్‌‌‌‌, రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ట్రోలింగ్ ముఠాలు ఓ ఆర్గనైజేషన్‌‌‌‌గా ఏర్పడి కొందరిని టార్గెట్ ​చేసి వారిపై అవమానకర పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎక్కువ ప్రశ్నిస్తారని, అందుకే తులసిపై  అవమానకర పోస్టులు, దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.