వరంగల్ లో.. ఏనీ టైమ్ కరోనా టెస్టులు

వరంగల్ లో.. ఏనీ టైమ్ కరోనా టెస్టులు

ఎంజీఎం సూరింటెడెంట్ నాగార్జునరెడ్డి

వరంగల్ అర్బన్ :  వరంగల్ వాసులకు శుభవార్త.. కోవిడ్ టెస్టుల కోసం ఎదురు చూపులు అవసరం లేకుండా 24 గంటలు పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా ఉందేమోనన్న అనుమానం వస్తే చాలు.. నేరుగా ఎంజీఎంకు వచ్చ టెస్టు లు చేయించుకోవచ్చు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు  చేశామని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ఎవరూ భయాందోళనలకు గురికాకుండా.. అనవసర ప్రదక్షిణలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎంజీఎం కోవిడ్ వార్డులో రోగుల సంఖ్య పెరిగిందని.. మొత్తం  440 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు.  ప్రస్తుతం 130మంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నాం.. ఇంకా ఎంతమంది రోగులు వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కరోనా లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఎంజీఎంలో ఇక నుంచి 24గంటలపాటు కోవిడ్ పరీక్షలు చేస్తామన్నారు. ఎంజీఎంలో ఎలాంటి వెంటిలేటర్ల కొరతలేదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరం లేదన్నారు.