
హైదరాబాద్: రౌడీ షీటర్ ను దారుణంగా హత్య చేశారు. బోరబండ, ఆర్కే సొసైటీ దగ్గర రౌడీషీటర్ ఫిరోజ్ ఖాన్ ను ప్రత్యర్థి గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. కళ్లలో కారం చల్లి.. కత్తులతో నరికి చంపారు. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మృతుడు ఫిరోజ్‌పై గతంలో భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని తెలిపారు పోలీసులు. రౌడీషీటర్ వహీద్ హత్య కేసులో కూడా ఫిరోజ్ ఖాన్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడని చెప్పారు. సంఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.