కోహెడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు

కోహెడ వ్యవసాయ  మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు

కోహెడ, వెలుగు: కోహెడ వ్యవసాయ మార్కెట్ లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.1.61 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ యార్డులో కవర్డ్  షెడ్​ నిర్మాణం కోసం రూ.1.01 కోట్లు, డ్రైయింగ్  ఫ్లాట్ ఫాం కోసం రూ.47 లక్షలు, కూరగాయల మార్కెట్ మొదటి అంతస్తులో చైర్మన్  ఛాంబర్, మీటింగ్  హాల్  నిర్మాణం కోసం రూ.13 లక్షలు మంజూరయ్యాయి.

మంత్రి పొన్నం ప్రభాకర్  చొరవతో నిధులు మంజూరయ్యాయని మార్కెట్  కమిటీ పాలకవర్గం, రైతులు హర్షం వ్యక్తం చేశారు.