టెన్త్ స్టూడెంట్లకు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం :  ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

టెన్త్ స్టూడెంట్లకు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం :  ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఉన్నత చదువులకు అండగా నిలుస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా సోమవారం క్యాంప్​ ఆఫీస్​లో నియోజకవర్గంలో టెన్త్​ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 66 మంది విద్యార్థులను సన్మానించి, ప్రశంసాపత్రాలు, రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని రిటైర్డ్  కలెక్టర్, టీటీడీ జేఈవో  ఆదావత్  శరత్ నాయక్ తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రోత్సాహకాలతో విద్యార్థులకు చదువు విలువ తెలుస్తుందన్నారు. విద్య ద్వారానే ఏదైనా సాధిస్తామనే భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అనంతరం మున్సిపల్  కాంప్లెక్స్  వద్ద మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్  నేత, మున్సిపల్  చైర్​పర్సన్  చిలుకూరి సుధా బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.