మల్కాజిగిరి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.37 కోట్లు మంజూరు చేయడంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో జడ్పీహెచ్ఎస్ ఉప్పల్, జడ్పీహెచ్ఎస్ కుషాయిగూడ స్కూళ్లను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.
అదనపు తరగతి గదుల నిర్మాణం, అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు పలు తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
