బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కాలనీలోని వ్యాపారి ఇంట్లో రూ.40 లక్షలు చోరీ

బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కాలనీలోని వ్యాపారి ఇంట్లో రూ.40 లక్షలు చోరీ

జూబ్లీహిల్స్, వెలుగు: ఓ వ్యాపారి ఇంట్లో రూ.40 లక్షలు చోరీకి గురయ్యాయి. 6 నెలల్లో దశలవారీగా డబ్బులు మాయమైనట్లు బాధితుడు గుర్తించారు. ఈ ఘటన బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎమ్మెల్యే కాలనీలో చోటుచేసుకుంది.

రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌12లో నివసించే వ్యాపారవేత్త జీఎస్.రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(66) తన పడక గదిలోని సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నగదు, అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లను భద్రపరిచారు. డబ్బులు క్రమంగా తగ్గుతున్నట్లు గుర్తించిన ఆయన.. చివరికి రూ.32 లక్షల భారతీయ కరెన్సీతో పాటు 9,000 అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లు చోరీ అయ్యాయని నిర్ధారించుకున్నారు. ఈ మొత్తం విలువ రూ.40 లక్షలు ఉంటుంది.

ఈ ఘటనకు సంబంధించి ఇంట్లో పనిచేసే వారిపైనే రామ్​ప్రసాద్​కు అనుమానం కలిగింది. దీంతో ఇంట్లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండారు యశ్వంత్, పని మనిషి చిరు తరచూ తన పడక గదిలోకి వెళ్లినట్లు కనిపించింది. లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నగదు మాయమైన ఘటనతో వారికి సంబంధం ఉండొచ్చంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బంజారా హిల్స్ పోలీసులు పేర్కొన్నారు.