సెప్టెంబర్ 18న పిఠాపురంలో సినిమా విడుదల

సెప్టెంబర్ 18న పిఠాపురంలో సినిమా విడుదల

రాజేంద్ర ప్రసాద్‌‌‌‌‌‌‌‌ ప్రధాన పాత్రలో ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’.  దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్‌‌‌‌‌‌‌‌.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) నిర్మించారు.  సెప్టెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రైమ్ షో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతోందని తెలియజేశారు. 

లవ్, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్,  సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు యూత్‌‌‌‌‌‌‌‌కు మంచి   సందేశాన్ని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు.  పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీసీ క్రిష్​ సంగీతాన్ని అందించాడు.