సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ గొప్ప ఆలోచన: అలీ 

సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ గొప్ప ఆలోచన: అలీ 

దక్షిణాది మీడియా రంగంలో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులు, మీడియా సంస్థలు, డిజిటల్ క్రియేటర్ల సేవలను గుర్తించి పురస్కరించేందుకు టీఎన్‌‌‌‌‌‌‌‌ఐటీ  మీడియా అకాడమీ ఆధ్వర్యంలో  సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ 2026 కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కు హాజరైన నటులు అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లను గుర్తించి అవార్డులు అందించడం గొప్ప ఆలోచన అన్నారు.  మీడియా ప్రతినిధులకు హెల్త్ కార్డులు అందిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని, ఇందుకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.  

దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు అవార్డుల నిర్వహణను అభినందించారు.  నిర్వాహకుడు రఘు భట్ మాట్లాడుతూ.. సినిమా, పొలిటికల్ బ్యూరో, మెట్రో, కెమెరా, ప్రింట్ మీడియా తదితర అన్ని విభాగాలకు అవార్డులు అందజేస్తామని తెలిపారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మీడియా ప్రతినిధులను గౌరవించనున్న ఈ అవార్డుల వేడుక అక్టోబర్ 23న బెంగళూరులో జరగనుంది.