‘చాంపియన్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి అనస్వర రాజన్.. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. మంగళవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్స్‌ను రిలీజ్ చేసి బర్త్‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాకా’ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇందులో ‘అమ్ములు పాప’గా ఆమె పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. చేతిలో పుస్తకాలు, వైట్ కోట్, స్టెతస్కోప్, భుజంపై బ్యాక్‌ప్యాక్‌తో మెడికల్ కాలేజ్ స్టూడెంట్‌గా సింపుల్ అండ్ నేచురల్ లుక్‌లో అనస్వర కనిపించింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు సంగీత్ శోభన్‌కు జంటగా ‘అంతా రాములోరు చూస్కుంటారు’ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరీలో ఆమె శిరీష పాత్రను పోషిస్తున్నట్టు రివీల్ చేశారు. అలాగే తెలుగులో ఆమె నటిస్తున్న ‘ఇట్లు అర్జున’ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌తో తనకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్.
