నయనతార లీడ్ రోల్‌లో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ (అమ్మోరు తల్లి) చిత్రం తమిళ, తెలుగు భాషల్లో మెప్పించిన విషయం తెలిసిందే. ఆరేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌ను ఆర్జే బాలాజీ తెరకెక్కించగా, సీక్వెల్‌కు సుందర్ సి దర్శకత్వం వహిస్తూ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. రెజీనా, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో ‘మహాశక్తి’ టైటిల్‌తో విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి ఓ అప్‌డేట్ వినిపిస్తోంది. దీపావళి సందర్భంగా నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఫస్ట్ పార్ట్ ‘అమ్మోరు తల్లి’ కూడా దీపావళి సీజన్‌లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ దీపావళికే విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.
మరోవైపు దీపావళి సీజన్‌లో సూర్య హీరోగా నటిస్తున్న 47వ చిత్రం రాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘రామాయణ’ కూడా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ రెండు చిత్రాలతో నయనతార సినిమా గట్టిపోటీని ఎదుర్కో బోతోంది.
