పీజీ స్థాయిలోనే కాదు ప్రగతి భవన్ లోనూ ర్యాగింగ్ ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులను ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. పీజీ స్థాయిలోనే కాదు ప్రగతి భవన్ లోనూ కనిపించని ర్యాగింగ్, బెదిరింపులు ఉన్నాయని ఆరోపించారు. పేద వర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందన్నారు. పేద వర్గాలపై అన్యాయంగా దాడులు చేస్తున్నారని.. బలహీన వర్గానికి చెందిన వాళ్లు డాక్టర్స్ కాకుడదా? అని ప్రశ్నించారు. ప్రీతి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కొందరు రాజకీయ రంగు పులముతున్నారని.. ఇది లహ్ జిహాద్ అని అనడం కరెక్ట్ కాదన్నారు.
