తిరుపతి జనసేన పార్టీ సమావేశంలో రభస చోటు చేసుకుంది. చిత్తూరు, కడప జిల్లాల నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. శనివారం ( మే 9 ) జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమక్షంలో జరుగుతున్న సమావేశం రసాభాసగా మారింది.
కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు సహా ఎవ్వరూ ఆ పదవుల్లో వద్దని నినాదాలు చేస్తూ స్టేజి దగ్గరికి దూసుకెళ్లారు కార్యకర్తలు.ఈ క్రమంలో సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏ సమస్య వచ్చినా ఎవరూ స్పందించరని... వీళ్ళేమి నాయకులు అంటూ ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. ఇలాంటి నేతలతో పార్టీని ఎలా బలోపేతం చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.
►ALSO READ | శ్రీవారి భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల దర్శన కోటాపై కీలక అప్ డేట్...
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే సింగిల్ పోటీ చేసి విజయం సాధించడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నారు కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ కూడా సింగిల్ ఎన్నికల బరిలో నిలబడి గెలిచి తమ పరువు కాపాడాలని కోరుతూ... కడప జిల్లాకు చెందిన జనసేన నేత రిలీజ్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతలోనే.. ఇప్పుడు తిరుపతి సమావేశంలో జరిగిన రభస చోటు చేసుకోవడం పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
