 
                                    హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీఏ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న ప్రైవేట్బస్సులపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆరో రోజైన గురువారం నగరంలో ప్రైవేట్ బస్సుల తనిఖీలు చేపట్టారు. ఈస్ట్జోన్పరిధిలో కమర్షియల్గూడ్స్ రవాణా చేస్తున్న ఒక బస్సు పై అధికారులు కేసు నమోదు చేసి రూ. 2 వేల జరిమానా విధించారు. అలాగే కమర్షియల్ గూడ్స్తరలింపుతోపాటు ఫైర్‌సేఫ్టీ, ఎమర్జెన్సీ అలారం లేని నాలుగు బస్సులపై కేసులు నమోదు చేసి రూ.9 వేల జరిమానా విధించారు. ఆరు రోజుల్లో మొత్తం 214 కేసులు నమోదు చేసిన అధికారులు.. 9 బస్సులను సీజ్ చేశారు. జరిమానాగా రూ.5.05 లక్షలు వసూలు చేశామన్నారు.

 
         
                     
                     
                    