ఆర్టీసీలో డిజిటల్ టికెట్లతో 505 కోట్ల ఆదాయం

ఆర్టీసీలో డిజిటల్ టికెట్లతో 505 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ డిజిటల్ చెల్లింపుల్లో భారీ వృద్ధి సాధించింది. గత 11 నెలల్లో 42.75 కోట్ల డిజిటల్ టికెట్లు జారీ చేయగా, వాటి ద్వారా సంస్థ ఖాతాలో రూ.505.95 కోట్లు జమ అయినట్లు అధికారులు తెలిపారు. 

యూపీఐ లావాదేవీల్లో 1265.99 శాతం వృద్ధి నమోదైంది. కండక్టర్ల వద్ద ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కానింగ్‌‌తో ప్రయాణికులు సులభంగా చెల్లింపులు చేయడంతో డిజిటల్ పేమెంట్లు వేగంగా పెరిగాయని చెప్పారు. దీంతో చిల్లర సమస్యకు చెక్ పడిందన్నారు.