సంక్రాంతికి ఆర్టీసీ ఆఫర్

సంక్రాంతికి ఆర్టీసీ ఆఫర్

సంక్రాంతి పండుగకు సొంతూర్లు వెళ్లే వారికి కోసం టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగకు ఈసారి కూడా అదనపు బస్సులు నడపబోతున్నట్లు  TSRTC ప్రకటించింది. ప్రయాణికులకు 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

అయితే రానుపోనూ ఒకేసారి రిజర్వేషన్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. జనవరి 31 వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. డీలక్స్, సూపర్  లగ్జరీ,  రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ బుకింగ్ కి ఈ ఆఫర్ ను అమలు చేస్తోంది. సంక్రాంత్రి సందర్భంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాయితీని ప్రకటించినట్లు టీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ బెస్ట్ ఆప్షన్ అని ఎండీ సజ్జనార్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరుతున్నారు.