V6 News

ఏఐపై అతిగా ఆధారపడితే మెదడు మొద్దుబారిపోతుందా ? ఏఐ వాడకంలో పెరుగుతున్న విద్యార్థులు..

ఏఐపై అతిగా ఆధారపడితే మెదడు మొద్దుబారిపోతుందా ?  ఏఐ వాడకంలో పెరుగుతున్న విద్యార్థులు..

గ్యాలప్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన లేటెస్ట్ స్టడీ ప్రకారం.. దాదాపు 57 శాతం మంది విద్యార్థులు ప్రతివారం ఏఐ టూల్స్ వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల స్టూడెంట్స్ చదివే విధానం చాలా ఈజీ అయింది. మ్యాథ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, వ్యాసాలు రాయడం, కొత్త భాషలు నేర్చుకోవడం వంటివి వాళ్లు త్వరగా పూర్తి చేయగలుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ ప్రతి వారం ఏఐ టూల్స్ వాడడం వల్ల టైం ఆదా అవుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని ఈజీగా పొందే అవకాశం కలుగుతుంది. 

అయితే ఈ సౌకర్యాల వెనక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విమర్శనాత్మక ఆలోచనా శక్తి తగ్గిపోతుందనే టెన్షన్ ఉంది. స్టూడెంట్స్ హోంవర్క్, ప్రాజెక్ట్ కోసం ఏఐ మీద ఎక్కువగా ఆధారపడితే, స్వతంత్రంగా ఆలోచించే అలవాటు తగ్గుతుంది. దీన్ని "కాగ్నిటివ్ ఆఫ్ లోడింగ్" అంటారు. అంటే మన మెదడు పని ఏఐకి అప్పగించడం. దీని వల్ల లోతైన ఆలోచన తగ్గే ప్రమాదం ఉంది. ఇంకా ఒక సమస్య ఏంటంటే ఏఐ ఇచ్చే సమాచారం ఎప్పుడూ సరిగ్గా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో తప్పు సమాచారాన్ని కూడా నమ్మకంగా చూపిస్తుంది. 

స్టూడెంట్స్ దానిని పరిశీలించకుండా నమ్మితే, తప్పు సమాచారం పొందే ప్రమాదం ఉంది. దీని ప్రభావం వాళ్ల చదువుపై పడుతుంది. ఫ్యూచర్ ఉద్యోగాల్లో కూడా ఇబ్బందులు రావొచ్చు. ఎందుకంటే, చదువుకునే సమయంలోనే ఏఐ మీద ఎక్కువగా ఆధారపడితే, సొంతంగా డెసిషన్ తీసుకునే స్కిల్ డెవలప్ అవ్వదు. ఏఐ పూర్తిగా చెడు కాదు. కానీ సరైన విధంగా ఉపయోగిస్తే ఇది మంచి టూల్. ఇది స్టూడెంట్స్ నాలెడ్జ్ పెంచుతుంది. 

కానీ వాళ్లు వేగంగా నేర్చుకున్నా లోతైన ఆలోచన తగ్గే ప్రమాదం ఉంది. అంటే “ఫాస్ట్ థింకర్స్”గా మారి “డీప్ థింకర్స్” కాకపోవచ్చు. కాబట్టి సరైన బ్యాలెన్స్ అవసరం. ఏఐని ఏజెంట్ గా వాడాలి. కానీ దానిపై పూర్తిగా ఆధారపడకూడదు. సొంతంగా ఆలోచించడం, విశ్లేషించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ముఖ్యం. మొత్తానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనం. దాన్నిఎలా ఉప యోగిస్తామన్నది మన ఐడియాలజీ మీద ఆధారపడి ఉంటుంది.