హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ ఏండీ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. 2026–27 విద్యా సంవత్సరంలోని మొత్తం 227 పనిదినాల పాటు విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
