మే 31, జూన్ 1న ఆర్టీసీ డిమాండ్ డే

 మే 31, జూన్ 1న ఆర్టీసీ డిమాండ్ డే

హైదరాబాద్, వెలుగు: జూన్ 2న ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రకటన చేయాలని కోరుతూ ఆర్టీసీ యూనియన్లు నిరసనకు పిలుపునిచ్చాయి.  ఈ నెల 31, వచ్చే నెల 1న  డిమాండ్ డేగా పాటించాలని కార్మికులకు సూచించాయి.

ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అధ్యక్షతన జేఏసీలోని పలు యూనియన్ల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని కోరారు.  అశ్వత్థామ రెడ్డి నాయకత్వంలోని మరో జేఏసీ వచ్చే నెల 1న డిమాండ్ డేగా పాటించాలని  పిలుపునిచ్చింది.