క్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్‌‌‌‌

క్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్‌‌‌‌

వింబుల్డన్‌‌‌‌: రష్యా టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌‌‌ ఆండ్రీ రుబ్లెవ్‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌లో తొలిసారి క్వార్టర్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేరుకున్నాడు.   ఆదివారం సెంటర్‌‌‌‌ కోర్టులో ఐదు సెట్ల పాటు జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ఏడో సీడ్‌‌‌‌ రుబ్లెవ్‌‌‌‌ 7–5, 6–3, 6–7 (6/8), 6–7 (5/7), 6–4తో  23వ సీడ్‌‌‌‌ అలెగ్జాండర్ బుబ్లిక్‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌)పై థ్రిల్లింగ్‌‌‌‌ విక్టరీ సాధించాడు. తొలి రెండు సెట్లు నెగ్గిన రుబ్లెవ్‌‌‌‌ ఈజీగా మ్యాచ్‌‌‌‌ గెలిచేలా కనిపించాడు. కానీ, అనూహ్యంగా పుంజుకున్న బుబ్లిక్‌‌‌‌ 39 ఏస్‌‌‌‌లతో హడలెత్తించాడు.  తర్వాతి రెండు సెట్లను టై బ్రేక్స్​లో గెలిచి 2–2తో స్కోరు సమం చేసి ఉత్కంఠ రేపాడు. 

కానీ, ఐదో సెట్‌‌‌‌లో తనదైన స్టయిలో విజృంభించిన ఆండ్రీ క్వార్టర్స్‌‌‌‌ బెర్తు సొంతం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్​ల్లో 8వ సీడ్‌‌‌‌ సినర్‌‌‌‌  (ఇటలీ) 7–6 (7/4), 6–4, 6–3తో గాలన్‌‌‌‌ (కొలంబియా)ను ఓడించగా, అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌ సఫియుల్లిన్‌‌‌‌ (రష్యా) 3–6, 6–3, 6–1, 6–3తో 26వ సీడ్‌‌‌‌ కెనడా స్టార్‌‌‌‌ డెనిస్‌‌‌‌ షపవలోవ్‌‌‌‌కు షాకిచ్చాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో నాలుగో సీడ్‌‌‌‌ పెగులా (అమెరికా) 6–1, 6–3తో సురెంకో (ఉక్రెయిన్‌‌‌‌)ను చిత్తు చేసి క్వార్టర్స్‌‌‌‌ చేరింది. 

మరో మ్యాచ్‌‌‌‌లో వొండ్రుసోవా (చెక్‌‌‌‌) 2–6, 6–4, 6–3తో తోటి ప్లేయర్‌‌‌‌, 32వ సీడ్‌‌‌‌ బుజ్కోవాను ఓడించింది. ఇక, మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ తొలి రౌండ్​లో ఇండియా జంట సాకేత్‌‌‌‌ మైనేని–యూకీ భాంబ్రీ 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్‌‌‌‌)–అడ్రియన్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌) ద్వయం చేతిలో ఓడింది. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌లో  ఆరో  సీడ్‌‌‌‌  రోహన్​ బోపన్న (ఇండియా)–దబ్రౌస్కి (కెనడా) జంట 7–-6 (7/5), 3–-6, 4-–6తో డోడింగ్‌‌‌‌ (క్రొయేషియా)–లతిష (తైవాన్‌‌‌‌) చేతిలో ఓడిపోయింది.