డెలివరీ బాయ్స్ కష్టాలు ఇలాగే ఉంటాయి.. ఎక్కడికెళ్లినా చులకనే

డెలివరీ బాయ్స్ కష్టాలు ఇలాగే ఉంటాయి.. ఎక్కడికెళ్లినా చులకనే

ఆకలవుతున్నప్పుడు కడుపు నింపే వాడు ఆ క్షణాన దేవునితో సమానమే. అది మనం డబ్బు పెట్టి కొన్నా.. మనదాకా రావడానికి శ్రమించి వారందరికి మనం విదేయత చూపించాల్సిందే. ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్ ఐటమ్‌ని ఎంత ఇష్టపడి ఆర్డర్ పెట్టుకున్నామో.. అది తెచ్చిన వ్యక్తిని కూడా అంతే గౌరవంగా చూడాలి.  కానీ కొంతమంది డెలవరీ బాయ్స్ ను చాలా చులకనగా చూస్తారు. అయితే కెనడాలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్న ఓ భారతీయుడికి బాధాకరమైన ఘటన ఎదురైంది. పిజ్జా డోర్ డెలివరీ చేయడానికి వెళ్లిన యువకుడిని కస్టమర్ అసభ్య పదజాలంతో తిట్టాడు. డెలివరీ నిబంధన ప్రకారం ఆ పేమెంట్ కార్డ్ లేదా ఆన్ లైన్ ద్వారానే చేయాలి. దీంతో డెలవరీ చేసిన వ్యక్తి పిజ్జా బిల్ అదే విధంగా పే చేయమన్నాడు.  

కానీ తన దగ్గర కేవలం క్యాష్ మాత్రమే ఉందని డెలవరీ చేసిన వ్యక్తంపై కస్టమర్ విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా  స్టుపిడ్ బ్రౌన్ గై, డమ్మీ  అని డబుల్ మీనింగ్ పదాలతో జాతిని ఉద్దేశించి కూడా తిట్టాడు. ఆ టైంలో తన కస్టమర్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించగా.. వారు అందుబాటులోకి రాలేదు. డెలివరీ బాయ్ తనకు జరిగిన అవమానాన్ని, తన గోడును చెప్పుకుంటూ 5నిమిషాల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అది వైరల్ గా మారింది. అందరూ ఆవీడియోకి స్పందిస్తూ యువకుడిపై సానుభూతి చూపిస్తూ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో డెలివరీ బాయ్స్ ఎదుర్కొనే సమస్యల గురించి తెలియజేస్తుంది.