అమెరికా వైట్ హౌజ్ లో కాల్పులు కలకలం రేపాయి. కరస్పాండెంట్స్ డిన్సర్ లో కాల్పులు జరిపాడు గుర్తు తెలియని దుండగుడు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ట్రంప్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కాల్పుల అలజడి రేగడంతో ఆయనను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. దీంతో వైట్ హౌజ్ లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ట్రంప్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ తోపాటు ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, అతని భార్యను సురక్షితంగా తరలించారు సెక్యూరిటీ సిబ్బంది.
అమెరికా మీడియా ప్రకారం.. ఏప్రిల్ 25, 2026 శనివారం రాత్రి ప్రెస్ డిన్నర్ లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్ధం వినిపించడంతో భయంతో అతిథులంతా టేబుల్స్ కింద దాక్కున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదికపై కూర్చొని ఉండగా వేగంగా దూసుకొచ్చిన దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం..అయితే చాకచాక్యంగా వ్యహరించిన సెక్యూరిటీ బలగాలు ట్రంప్ ను సురక్షితంగా ప్రాంతానికి తరలించారు.
ఈ ఘటన సమయంలో జరిగినప్పుడు అక్కడ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సహా సుమారు 2వేల600 మంది ఉన్నారు. అయితే కాల్పులు జరిగిన కొద్దిసేపటికే తిరిగి డిన్నర్ ప్రారంభమైందని మీడియా తెలిపింది.
ఈ ఘటన జరిగిన వెంటనే ట్రంప్ ట్రూత్ సోషల్ లో స్పందించారు. మా సీక్రెట్ సర్వీస్, భద్రతా ఏజెన్సీలు చాకచక్యం, ధైర్యం ప్రదర్శించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు. కార్యక్రమం కొనసాగించాలని నేను అధికారులను కోరాను..అయితే తుది నిర్ణయం భద్రతా అధికారులదే నని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో రాశారు.
#WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event.
— ANI (@ANI) April 26, 2026
(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Z2nDjWzWW0

