షాద్ నగర్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, మల్టీ స్పెషాలిటీ దవాఖానలపై మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ఏబీవీ హాస్పిటల్‌ను తనిఖీ చేసి డాక్టర్ చేట్టిపల్లి ఆనంద్ కుమార్ ఎన్ ఎంసీ గుర్తింపు లేకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్నట్లు గుర్తించారు. ఎకో టెక్నీషియంతో టుడే ఎకో పరీక్షలు నిర్వహించి కార్డియాలజిస్ట్ గా సంతకం చేస్తుండడంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు. చర్యలకు టీజీఎంసీ ఎతికల్ కమిటీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. 2డి ఎకో టెక్నీషియన్ పైనా కేసు నమోదు చేస్తామన్నారు.
పట్టణంలోని కీర్తి పాలి క్లినిక్, బాలాజీ పాలి క్లినిక్, గణేశ్ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నట్లు గుర్తించారు. వీటిలో ఫస్ట్ ఎయిడ్ పేరుతో అలోపతి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదకరైన స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్ ఇంజక్షన్స్ వాడుతున్నారు. వీరికి నోటీసులు ఇచ్చిన అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
