ఎప్పుడూ లేనంతగా  పతనమవుతున్న దేశ కరెన్సీ

ఎప్పుడూ లేనంతగా  పతనమవుతున్న దేశ కరెన్సీ
  •     ఎప్పుడూ లేనంతగా  పతనమవుతున్న దేశ కరెన్సీ
  •     ఫెడ్ రేట్ల పెంపు, మార్కెట్‌‌‌‌ పతనం, పెరుగుతున్న క్రూడ్ ధరలే కారణం

 బిజినెస్‌‌‌‌‌‌‌‌, డెస్క్, వెలుగు: యూఎస్ ఫెడ్‌‌‌‌తో సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుండడంతో రూపాయి విలువ పడిపోతోంది. ఈ నెల 9 న డాలర్ మారకంలో 77.52 వద్ద ఆల్‌‌‌‌ టైమ్‌‌‌‌ కనిష్టాన్ని నమోదు చేసిన రూపాయి, గురువారం సెషన్‌‌‌‌లో ఈ లెవెల్‌‌‌‌ను దాటేసి కొత్త ఆల్‌‌‌‌టైమ్ కనిష్టాన్ని  నమోదు చేసింది.  డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 77.63 లెవెల్‌‌ను టచ్‌‌ చేసింది. చివరికి 77.40 వద్ద సెటిలయ్యింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే రూపాయి విలువ 78 లెవెల్‌‌‌‌ను తాకినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఉక్రెయిన్‌‌‌‌–రష్యా యుద్ధంతో గ్లోబల్‌‌‌‌గా ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెరుగుతోంది.  దేశంలో కూడా ఇన్‌‌‌‌ఫ్లేషన్  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న అప్పర్‌‌‌‌‌‌‌‌ లిమిట్‌‌‌‌ను క్రాస్‌‌‌‌ చేసింది.  దీంతో ఇండియాతో సహా చాలా దేశాలు వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టాయి.  దీంతో ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి తమ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను  విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకుంటున్నారు.  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 1.4 లక్షల కోట్లను దేశ స్టాక్ మార్కెట్‌‌‌‌ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారని అంచనా. దీనికితోడు జియోపొలిటికల్ టెన్షన్లతో క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నాయి.  దీని ఎఫెక్ట్ రూపాయిపై డైరెక్ట్‌‌‌‌గా పడుతోంది. మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ పెరుగుతుండడంతో రూపాయి వాల్యూ పడుతోందని చెప్పొచ్చు. రూపాయి వాల్యూ పడితే ఎక్స్‌‌పోర్ట్స్‌‌ చేసే కంపెనీలు లాభపడతాయి. కానీ, ఇంపోర్ట్స్ మాత్రం ఖరీదుగా మారతాయి. కాగా, ఐటీ సర్వీస్‌‌లు, ఫార్మా ప్రొడక్ట్‌‌లను ఎక్కువగా ఎక్స్‌‌పోర్ట్ చేస్తున్నాం.  క్రూడాయిల్‌‌, గోల్డ్‌‌, వంటనూనెలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.

టీవీలు, ఫ్రిజ్‌‌‌‌ల రేట్లు మరింత పైకి

ముడిసరుకుల రేట్లు పెరగడంతో పాటు, రూపాయి విలువ పడుతుండడంతో  టీవీలు, ఫ్రిజ్‌‌లు, వాషింగ్ మెషిన్లు, ఫోన్లు వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ రేట్లు మరో 3–5 శాతం పెరుగుతాయని  ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో రేట్ల పెంపు ఉంటుందని పేర్కొన్నాయి. ఇన్‌‌పుట్ కాస్ట్ పెరగడంతో ఈ ఏడాది  జనవరిలో ఒకసారి కంపెనీలు రేట్లను పెంచాయి. కొన్ని ఏసీల తయారీ కంపెనీలు మే నెలలో కూడా రేట్లను పెంచాయి.  తాజాగా ఇన్‌‌పుట్ కాస్ట్ మరింత పెరగడంతో పాటు, రూపాయి విలువ పడడంతో రేట్లను పెంచుతామని చెబుతున్నాయి.  రూపాయి విలువ పతనంతో ముడిసరుకులను దిగుమతి చేసుకోవడం మరింత భారంగా మారిందని కంపెనీలు చెప్పుకొస్తున్నాయి. మరోవైపు చైనాలో కరోనా లాక్‌‌డౌన్ కొనసాగుతుండడంతో సప్లయ్ చెయిన్‌‌లో సమస్యలు నెలకొన్నాయి. దీంతో  రామెటీరియల్స్ ధరలు పెరుగుతున్నాయి. ఈ భారాన్ని కస్టమర్లకు ట్రాన్స్‌‌ఫర్ చేయాలని కంపెనీలు చూస్తున్నాయి.