పల్లెవెలుగు రూట్లు ప్రైవేటుకు : కేసీఆర్

పల్లెవెలుగు రూట్లు ప్రైవేటుకు : కేసీఆర్

హైదరాబాద్ : పల్లె వెలుగు రూట్లను ప్రైవేట్ కు అప్పగించనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. ఆర్టీసీపై జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం మాట్లాడారు. గ్రామాల్లో తిరిగే రూట్లలో ఆర్టీసీకి నష్టం వస్తుందని వస్తున్న ఆరోపణల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోగ్యకరమైన పోటీకోసమే 5100 బస్సులను ప్రైవేట్ కు పర్మిట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్టీసికి 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇచ్చిన డబ్బులను తమ ప్రభుత్వం ఏడాదిలోనే ఇచ్చామని తెలిపారు.

5100 బస్సులు ప్రైవేటుకు ఇచ్చిన పర్మిట్ కు సంబంధించినవి రవాణా శాఖ చూస్కుంటుందన్నారు. వీలైనంత త్వరలోనే బస్సులు పల్లెవెలుగులో పరుగులు తీస్తాయన్నారు. ఆర్టీసీకి 5వేలు, ప్రైవేట్ కు 5వేల బస్సులు ఉంటాయని..ఆర్టీసీ ఆదాయం పెంచేందుకే ఈ నిర్ణయం  తీసుకున్నామన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులు భేషరతుగా డ్యూటీలోకి వస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు సీఎం.